17
August, 2026

A News 365Times Venture

17
Monday
August, 2026

A News 365Times Venture

Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!

Date:

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల సమీపంలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

కాలువలో గల్లంతైన వారు పోతుల బాను వికాస్ (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుస్వంత్ (18), నాగబత్తుల సాయి సూర్య (19)లుగా గుర్తించారు. వీరంతా నరసాపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. స్నేహితుడి సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు వీరంతా ఐతంపూడి ప్రాంతానికి వెళ్లారు. వివాహ కార్యక్రమం ముగించుకుని తమ స్వగ్రామమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మార్గ మధ్యలో ఐతంపూడి లాకుల సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

గల్లంతైన యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోతుల బాను వికాస్ మృతదేహం ఐతంపూడి వద్ద లభించగా.. నాగిరెడ్డి దుస్వంత్ సాయి మృతదేహం మార్తేరులోని చించినాడ కాలువలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సాయి సూర్య, రాజారామ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐతంపూడి లాకుల ప్రాంతంతో పాటు కాలువ పరిసరాల్లో రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

స్నేహితుడి కుటుంబంలో వివాహ వేడుకకు వెళ్లిన యువకులు తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. యువకులంతా ఇంజనీరింగ్ విద్యార్థులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎలా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది, ప్రమాద సమయంలో వాహన వేగం ఎంత ఉంది వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) హత్య కేసు దర్యాప్తు...

Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!

Guntur Chilli Export Crisis: గుంటూరు మిర్చికి శ్రీలంకలో ఎదురుదెబ్బ తగిలింది....

Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ...

West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో కాంగ్రెస్ నేత, ఆయన...