28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!

Date:

H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాదారులకు కలవరం కలిగించేలా ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే వారికి లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసే దిశగా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉంది. ఈ నిబంధన గనక అమల్లోకి వస్తే, ఉద్యోగం పోయిన వెంటనే కొత్త కొలువు వెతుక్కునేందుకు ఏమాత్రం సమయం ఉండదు. ప్రభావిత ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా తక్షణమే అమెరికాను విడిచిపెట్టి స్వదేశానికి తిరిగి రావలసి ఉంటుంది.

చదువు, ఉద్యోగం, వ్యాపారం లేదా పర్యటన వంటి తాత్కాలిక అవసరాల కోసం వచ్చే విదేశీయులకు ఇచ్చే నాన్-ఇమిగ్రెంట్ వీసా విభాగంలో ఈ గ్రేస్ పీరియడ్ అత్యంత కీలకమైనది. 2017లో అమల్లోకి వచ్చిన ఈ నియమం ప్రకారం.. అనుమతి గడువు ముగియకముందే ఉద్యోగం ఊడిపోతే, విదేశీ ఉద్యోగులు మరొక కంపెనీలో చేరడానికి లేదా తమ వీసా హోదాను మార్చుకోవడానికి 60 రోజుల సడలింపు లభించేది. E-1, E-2, E-3, H-1B, H-1B1, L-1, O-1, TN వంటి ప్రధాన నాన్-ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఇది పెద్ద ఊరటగా ఉండేది. ఈ సడలింపు సమయం కేవలం ఉద్యోగులకే కాకుండా, అమెరికన్ కంపెనీలకు కూడా కొత్త సిబ్బందిని నియమించుకోవడానికి లేదా ఉన్నవారి స్థానంలో మార్పులు చేయడానికి ఎంతో ఉపయోగపడేది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి ఈ సమయాన్ని తగ్గించే లేదా తిరస్కరించే అధికారం ఉన్నప్పటికీ, గతంలో చాలా అరుదుగా మాత్రమే ఆ అధికారాలను ఉపయోగించేవారు.

ఈ కొత్త ప్రతిపాదన భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా హెచ్-1బీ వీసాలను పొందుతున్న వారిలో మన భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఉదాహరణకు 2024 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన మొత్తం వీసాల్లో ఏకంగా 71 శాతం భారతీయులకే దక్కాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 52 లక్షల (5.2 మిలియన్) మంది భారతీయ-అమెరికన్లు నివసిస్తున్నారు. అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడు ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌పైనే ఆధారపడి కొత్త అవకాశాలు వెతుక్కుంటున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ఈ ప్రతిపాదన తీవ్ర అభద్రతలోకి నెట్టివేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..

భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ మరోసారి తన అసాధారణ బ్యాటింగ్‌తో...

LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..

LPU Students Protest: పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)...

Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..

Mobile Recharge:  మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇన్నాళ్లు 28-రోజులకే ప్రీపెయిడ్ మొబైల్...

Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మార్పులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల నియామకాలు , సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను మరింత...