16
July, 2026

A News 365Times Venture

16
Thursday
July, 2026

A News 365Times Venture

FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!

Date:

Spain vs France: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ‘స్పెయిన్’ మరోసారి తన సత్తా చాటింది. సెమీఫైనల్‌లో టైటిల్ ఫెవరెట్ గా ఉన్న ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో ఓడించి ఘనంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. క్రమశిక్షణతో కూడిన ఆట, పటిష్టమైన డిఫెన్స్, వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడం ఇలా అన్ని కలిపి లూయిస్ డే లా ఫుయెంటే శిష్యులు విజయం అందుకున్నారు. మికెల్ ఒయార్జబాల్, పెడ్రో పోరో చేసిన గోల్స్ స్పెయిన్‌కు విజయాన్ని అందించాయి. దీంతో ఆదివారం జరిగే ఫైనల్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనా మ్యాచ్ విజేతతో స్పెయిన్ తలపడనుంది.

పెనాల్టీతో ఆధిక్యం:

మ్యాచ్ 22వ నిమిషంలో కీలక మలుపు అందుకుంది. యువ స్టార్ లామిన్ యమాల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నే పెనాల్టీ బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఆ అవకాశాన్ని మికెల్ ఒయార్జబాల్ ఎలాంటి తప్పిదం చేయకుండా గోల్‌గా మలిచాడు. బంతిని కుడి వైపు కింద మూలకు పంపి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ గోల్ తర్వాత స్పెయిన్ ఆటలో మరింత ఆత్మవిశ్వాసం కనిపించగా.. ఫ్రాన్స్ మాత్రం బంతిపై ఆధిపత్యం సాధించినప్పటికీ దాన్ని గోల్స్‌గా మార్చలేకపోయింది. కిలియన్ ఎంబాప్పే చాలావరకు గోల్స్ కోసం దాడులు చేసినా స్పెయిన్ డిఫెన్స్ అద్భుతంగా అడ్డుకుంది.

మ్యాచ్‌పై పూర్తి పట్టు:

రెండో భాగం 58వ నిమిషంలో స్పెయిన్ మరోసారి జట్టు సమన్వయంతో రెండో గోల్ సాధించింది. డానీ ఒల్మో ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న పెడ్రో పోరో సాఫీగా బంతిని గోల్‌లోకి పంపించాడు. ఈ గోల్‌తో స్పెయిన్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఆ తర్వాత బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుతూ ఫ్రాన్స్‌కు అవకాశాలు ఇవ్వకుండా తెలివిగా ఆటను నడిపించింది.

స్పెయిన్ డిఫెన్స్‌:

ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెషాంప్స్ పలు మార్పులు చేసినప్పటికీ స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయారు. అయ్మెరిక్ లపోర్టే నేతృత్వంలోని డిఫెన్స్ ప్రతి దాడిని సమర్థంగా అడ్డుకుంది. గోల్‌కీపర్ ఉనాయ్ సైమన్ కూడా కీలక సమయాల్లో అద్భుతమైన సేవ్‌లు చేస్తూ జట్టుకు అండగా నిలిచాడు. చివరి నిమిషాల్లో ఫ్రాన్స్ దూకుడు పెంచినా స్పెయిన్ రక్షణ గోడను బద్దలు కొట్టలేకపోయింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట

Rohit Sharma and Virat Kohli: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న...

Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!

Fire Accident: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో...

Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?

Shubman Gill Retires Hurt: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి...

Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద...