21
March, 2026

A News 365Times Venture

21
Saturday
March, 2026

A News 365Times Venture

YS Jagan: ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు!

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నేడు గుంటూరు మిర్చి యార్డ్‌కు జగన్‌ వచ్చారు. మిర్చి రైతుల కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

మిర్చి రైతుల సమావేశం అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయింది. రైతుల దీనస్థితికి ప్రభుత్వం కారణం కాదా?. మా హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారింది. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. మిర్చి రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదు. మా హయాంలో రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేది. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది’ అని జగన్‌ అన్నారు.

‘వైసీపీ హయాంలో రైతే రాజు కానీ.. కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు, రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి. ఈ ఏడాది మిర్చి దిగుబడి బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యార్డ్‌కు రావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. రైతులకు అండగా వైసీపీ ఎప్పుడూ ఉంటుంది’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు. జగన్‌ గుంటూరు పర్యటన నేపథ్యంలో భారీగా వైసీపీ కార్యకర్తలు, రైతులు, జనాలు వచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఆదివారం అంటేనే పండుగ. కానీ.. ప్రస్తుత...

Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?

Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి, ఆనందం, సోదరభావంతో ఘనంగా...

Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (TG FSL)లో వివిధ ఖాళీల...

Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

బోట్ (boAt) తన ప్రీమియం వాలర్ లైనప్‌లో భాగంగా భారత్ లో...