15
July, 2026

A News 365Times Venture

15
Wednesday
July, 2026

A News 365Times Venture

Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!

Date:

Virat Kohli: టీ20 సిరీస్‌లో ఊహించని ఫలితాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అభిమానుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఎలా ఆడబోతున్నాడని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదికూడా ఒకటి కాదు.. ఏకంగా 5 రికార్డులు కోహ్లీని ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డ్స్ ఏంటో చూసేద్దామా..

15 వేల వన్డే పరుగులు:

విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో 203 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్‌లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు.

టాప్ రన్ స్కోరర్‌గా కోహ్లీ:

ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడానికి కోహ్లీకి కేవలం 9 పరుగులు మాత్రమే అవసరం. ఈ రికార్డును తొలి మ్యాచ్‌లోనే అందుకునే అవకాశం ఉంది.

నంబర్-3లో అరుదైన ఘనత:

అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 16,000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి మరో 81 పరుగులు అవసరం.

వన్డేల్లో కొత్త చరిత్ర:

వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడానికి కోహ్లీకి 150 పరుగులు మాత్రమే కావాలి. ఈ సిరీస్‌లో మంచి ఫామ్ కొనసాగిస్తే ఈ రికార్డు కూడా అతని ఖాతాలో చేరే అవకాశం ఉంది.

అత్యధిక 50+ స్కోర్ల ఘనత:

ఇంగ్లాండ్‌పై అత్యధిక 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలవడానికి కోహ్లీకి కేవలం ఒక్క 50+ ఇన్నింగ్స్ మాత్రమే అవసరం. ఈ రికార్డు కూడా ఈ సిరీస్‌లోనే అందుకునే అవకాశముంది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌లో కనిపిస్తే వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లను చేరుకోవడమే కాకుండా.. టీమిండియాకు సిరీస్ విజయంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఈ సిరీస్‌లో అభిమానులందరి చూపు కోహ్లీ బ్యాట్‌పైనే నిలిచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?

Abhishek Sharma: భారత క్రికెట్‌లో సెన్సేషన్‌గా మారుతున్న యువ ఆల్‌రౌండర్ అభిషేక్...

Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ఓ భారీ భూ ఆక్రమణల...

Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్

Virat Kohli: భారత క్రికెట్ జట్టులో మరో కొత్త శకానికి తెరలేచింది....