29
June, 2026

A News 365Times Venture

29
Monday
June, 2026

A News 365Times Venture

Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

Date:

Ayodhya Donation Theft Case: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు న్యాయ సహాయం అందించబోమని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుల తరఫున ఎవరైనా న్యాయవాది కోర్టులో హాజరైతే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

భక్తుల మనోభావాల దృష్ట్యా నిర్ణయం

రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్ తెలిపారు. అందుకే నిందితుల తరఫున వాదించకూడదని సభ్యులంతా నిర్ణయించినట్లు వెల్లడించారు.

ట్రస్ట్ మాజీ ప్రతినిధులపై కూడా డిమాండ్

సమావేశంలో పలువురు న్యాయవాదులు శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌తో అనుబంధం ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు అయోధ్యను మూడు రోజుల్లో వీడాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే నగరాన్ని దిగ్బంధిస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఎనిమిది మంది నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో

అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ అలియాస్ తిన్నూ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రామమందిర విరాళాల నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో పనిచేసిన వారేనని, విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై జూన్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు.

విస్తరిస్తున్న దర్యాప్తు

కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే మాజీ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని ఇప్పటికే నమోదు చేసిన పోలీసులు, అవసరమైతే ఇతర ట్రస్ట్ ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు సమాచారం.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

Supreme Court: అయోధ్య రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ దాఖలైన...

AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా

AIADMK MLA Resignation: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు మరో భారీ...

Trump: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు....

Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో కోల్పోయిన అనంతరం భారత కెప్టెన్...