13
June, 2026

A News 365Times Venture

13
Saturday
June, 2026

A News 365Times Venture

IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..

Date:

భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ధర్మశాలలో కురిసిన భారీ వర్షం కారణంగా టాస్ పడటంలో 3 గంటల 45 నిమిషాల ఆలస్యమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను చెరి 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది.

తడబడిన అఫ్గాన్ – నిలబెట్టిన గుర్బాజ్..
ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్తాన్ జట్టుకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. పవర్‌ప్లేలోనే కేవలం 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గుర్నూర్ బ్రార్ తన రెండో ఓవర్లోనే ఇబ్రహీం జద్రాన్ (1) ను అవుట్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ వరుస ఓవర్లలో సెదికుల్లా అటల్ (0), రహ్మత్ షా (4)లను పెవిలియన్ చేర్చాడు.

ఈ దశలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి, అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతను మొత్తం 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (27 పరుగులు) తో కలిసి నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే నితీష్ కుమార్ రెడ్డి గుర్బాజ్‌ను బౌల్డ్ చేయడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. భారత డెబ్యూ బౌలర్ హర్ష్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేసి షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ (26), అల్లా గజన్‌ఫర్ (0) వికెట్లను పడగొట్టాడు. చివరి ఓవర్లో గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ (9), జియా ఉర్ రెహ్మాన్ (4) లను అవుట్ చేయడంతో అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు, అర్ష్‌దీప్, నితీష్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.

రోహిత్ శర్మ సరికొత్త రికార్డు..
భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భారత్ తరఫున వన్డేలు అతి పెద్ద వయస్సు ఉన్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతను 39 ఏళ్ల 44 రోజుల వయసులో ఈ మ్యాచ్ ఆడి, మోహిందర్ అమర్‌నాథ్ (37 ఏళ్ల 29 రోజులు) పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.

భారత్ ఛేజింగ్ – గిల్ అద్భుత బ్యాటింగ్..
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 46 పరుగులు జోడించాక రోహిత్ శర్మ (16) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా, శ్రేయస్ అయ్యర్ 12 పరుగులు చేసి నిష్క్రమించాడు.

మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు. అతను 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి, 13 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో...

Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..

ధర్మశాలలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్...

Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇరాన్ షాకిచ్చింది. 24 గంటల్లో ఇరాన్-అమెరికా...

Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న SUV

Tata Sierra EV: టాటా మోటార్స్(Tata Motors) ఎంతో ప్రతిష్టాత్మకం భావిస్తున్న,...