8
June, 2026

A News 365Times Venture

8
Monday
June, 2026

A News 365Times Venture

CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

Date:

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, రాబోయే స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అలాగే, కుప్పం నియోజకవర్గ కన్వీనర్ శ్రీకాంత్ సేవలను ఇకపై రాష్ట్ర స్థాయి అవసరాలకు, పార్టీ బలోపేతానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.

నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పదవుల్లో ఉన్నవారు కేవలం తమకు కేటాయించిన సంబంధిత శాఖల బాధ్యతలను మాత్రమే చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ లైన్‌కు లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

మరోవైపు.. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రేపు ముగియనుంది. టీడీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్.. రేపు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్లను అధికారికంగా దాఖలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుండటంతో, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఒకవైపు స్థానిక ఎన్నికల సమరశంఖం, మరోవైపు రాజ్యసభ స్థానాల భర్తీతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయంగా మరింత దూకుడు పెంచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..

భారత యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మంగళవారం...

Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!

ఇజ్రాయెల్‌పై దాడి చేయబోమని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణ వెల్లడించింది....

Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!

భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్పులు జరగబోతున్నాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా...

Mohammed Siraj: ముల్లన్‌పూర్‌ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..

న్యూ చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్...