30
May, 2026

A News 365Times Venture

30
Saturday
May, 2026

A News 365Times Venture

Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్

Date:

Gill Century Celebration: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాట్‌తో రెచ్చిపోగా.. స్టేడియంలో ఉన్న అతని తండ్రి లక్ష్విందర్ గిల్ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శుభ్‌మన్ గిల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుత టైమింగ్, క్లాస్ షాట్లతో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా ప్రతి బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలు సాధించాడు.

ఈ క్రమంలో గిల్ శతకాన్ని పూర్తి చేయగానే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఆ సమయంలో వెంటనే కెమెరాలు ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న అతని కుటుంబ సభ్యులపై ఫోకస్ చేశాయి. ఆ సమయంలో గిల్ తండ్రి లక్ష్విందర్.. దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా స్టైల్లో ప్రసిద్ధి చెందిన ‘థై స్లామ్’ సెలబ్రేషన్ చేయడం అభిమానులను ఆకర్షించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ముఖ్యంగా అదే రోజు సిద్ధూ మూసేవాలా వర్ధంతి కావడంతో ఈ సెలబ్రేషన్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పంజాబ్ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న సిద్ధూ మూసేవాలా 2022 మే 29న పంజాబ్‌ లోని మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన పాటలు, స్టైల్ ఇప్పటికీ కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి.

తన హోం క్రౌడ్ ముందు ఆడిన గిల్.. ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిని నమోదు చేశాడు. ఇది గిల్ ఐపీఎల్ కెరీర్‌లో ఐదో శతకం కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో గిల్ ఐపీఎల్ 2026 సీజన్‌లో 700 పరుగుల మార్క్‌ను కూడా దాటాడు. సీజన్ మొత్తం అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న గిల్.. మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తూ గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆదివారం నాడు RCBతో గుజరాత్ టైటాన్స్ టైటిల్ పోరులో అమితుమీ తేల్చుకోనుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!

Mosquito Repellent Study: వేసవి కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా...

Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్

Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తంరగా ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య...

Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!

రష్యా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ ఒప్పందం అంతర్జాతీయంగా...

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్...