20
May, 2026

A News 365Times Venture

20
Wednesday
May, 2026

A News 365Times Venture

Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Date:

Caste Census: రాబోయే జనగణనలో కులగణన నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన నిర్వహించాలా వద్దా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వారి జనాభా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసును విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి తెలుసుకోవాల్సిందే” అని సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు.

జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవడం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కులగణన చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా కులగణన అంశంపై రాజకీయంగా కూడా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం వంటి అంశాల్లో కులగణన కీలకమని పలువురు రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో రాబోయే జనగణనలో కులగణన నిర్వహణకు మార్గం సుగమమైనట్టేనని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జిమ్‌లలో హిందూ మహిళల్ని టార్గెట్...

Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..

అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ...

KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..

ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా...

UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..

UP: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే...