PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు స్వీడర్ చేరారు. ఈ నేపథ్యంలో స్వీడన్ ప్రభుత్వం ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ‘‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్‌క్రాస్’’ను ప్రదానం చేసింది. ఒక ప్రభుత్వ అధినేతకు లభించే అత్యున్నత గుర్తింపు, గౌరవంగా దీనిని భావిస్తారు.
ప్రధాని మోడీకి 31వ అంతర్జాతీయ పురస్కారం ఇది. భారత్-స్వీడన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, వివిధ రంగాలలో భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో చేసిన కృషికి గాను ప్రధానమంత్రి మోదీకి ఈ గౌరవం లభించింది.
అంతకుముందు,8 ఏళ్ల తర్వాత స్వీడన్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని ఆ దేశం ఘనంగా స్వాగతించింది. స్వీడన్ గగనతలంలో ప్రధాని విమానానికి స్వీడన్ ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా వచ్చాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మోడీని ఆహ్వానించడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్ పోర్ట్ బయట ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు.
Gothenburg: Sweden confers the 'Royal Order of Polar Star Commander Grand Cross' upon Prime Minister Narendra Modi
It is the utmost recognition and honour that can be conferred upon a Head of Government. This is the 31st global honour for PM Modi.
(Source: DD) pic.twitter.com/VB3O5CAn61
— ANI (@ANI) May 17, 2026




