13
May, 2026

A News 365Times Venture

13
Wednesday
May, 2026

A News 365Times Venture

Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!

Date:

Bomb Threat: పంజాబ్‌లో మరోసారి బాంబు బెదిరింపులు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కార్యాలయానికే బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ మెయిల్ రావడం కలకలం సృష్టించింది. కేవలం ముఖ్యమంత్రినే కాకుండా, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్‌ను సైతం లక్ష్యంగా చేసుకుంటూ దుండగులు ఈ మెయిల్‌ పంపారు. ఇందులో పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యాలయంతో పాటు చండీగఢ్, ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌ను సైతం పేల్చివేస్తామని స్పష్టంగా పేర్కొనడం గందరగోళానికి గురి చేస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశాయి.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం, బీజేపీ ఆఫీసుల వద్ద భద్రతా వలయాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. అయితే పంజాబ్‌లో ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. మే 7న జలంధర్‌లోని బి.ఎం.సి చౌక్ వద్ద ఉన్న ఏపీజే స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వెంటనే విద్యార్థులందరికీ సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేసింది. ఆ సమయంలో స్కూల్ క్యాంపస్‌లో తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. పంజాబ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Punjab

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!

Motorola Razr Fold Launched: మోటోరోలా (Motorola) భారత్‌లో కొత్త ఫోల్డబుల్...

Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?

Hantavirus: హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే వైరస్....

Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్‌ ఫైర్‌

Raghunandan Rao: తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ చేసిన...

Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు...