10
May, 2026

A News 365Times Venture

10
Sunday
May, 2026

A News 365Times Venture

Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!

Date:

Trisha: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. ద్రవిడ దిగ్గజాలు డీఎంకె, ఏఐఏడీఎంకేలకు గట్టి షాక్ ఇస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ 108 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక, ఆ పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచేందుకు నటి త్రిష కృష్ణన్ చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియానికి విచ్చేశారు. తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి ఇంటి నుంచి బయలుదేరి వచ్చారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూడటం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు త్రిష పేర్కొన్నారు.

ఈ వేడుకలో త్రిష నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయారు. బంగారు రంగు డిజైన్ ఉన్న చీర, దానికి జతగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి ఎంతో హుందాగా కనిపించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన హారం, మల్లెపూలతో ఆమె అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక, విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష ఆది నుంచి మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరిగిన రోజున, తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అప్పట్లోనే వైరల్ అయ్యింది. వారిద్దరి హిట్ చిత్రం ‘గిల్లీ’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఉన్న ఆ పోస్ట్ విజయ్‌కు త్రిష ఇస్తున్న మద్దతుగా అభిమానులు భావించారు.

అంతేకాకుండా, మే 4న త్రిష పుట్టినరోజు, ఎన్నికల ఫలితాల రోజున తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె చేసిన ఈ పర్యటన చర్చనీయాంశమైంది. ఫలితాల అనంతరం చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లి స్వయంగా అభినందనలు సైతం తెలిపారు. విజయ్, త్రిషల జోడీకి తమిళ చిత్రసీమలో ప్రత్యేక క్రేజ్ ఉంది. గిల్లీ, తిరుపాచ్చి, ఆతి, కురువి, గత ఏడాది వచ్చిన ‘లియో’ వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్‌కు శాపమయ్యాయా?

భారతీయ సినీ పరిశ్రమలో కొందరు నటీనటులు తమ నటనతో గుర్తింపు తెచ్చుకుంటే,...

Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”

Mothers Day Special: సృష్టిలో ఏ జీవికైనా జన్మనిచ్చేది స్త్రీ. ఒక...

TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!

ఎట్టకేలకు తమిళనాడు ట్విస్ట్‌లకు ఫుల్‌స్టాప్ పడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు...