28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..

Date:

itel Power 451 Launch: బడ్జెట్ ఫీచర్ ఫోన్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐటెల్ (itel) మరో కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా భారతదేశంలో itel Power 451 ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే AI ఆధారిత ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్‌లో 2.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. బ్లూ, గ్రీన్, పర్పుల్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం బాక్స్‌లో ఉచిత ప్రొటెక్టివ్ బ్యాక్ కవర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

AI కాల్ నాయిస్ రిడక్షన్:

ఐటెల్ పవర్ 451లో AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ కాన్సలేషన్ (AI-ENC) టెక్నాలజీని పొందుపరిచారు. ఈ ఫీచర్ కారణంగా మార్కెట్లు, ట్రాఫిక్ ప్రాంతాలు లేదా ఇతర శబ్దభరిత వాతావరణాల్లో కూడా కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గి స్పష్టమైన వాయిస్ వినిపిస్తుంది. ఫీచర్ ఫోన్ విభాగంలో AI ఆధారిత ఈ సౌకర్యం వినియోగదారులకు మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించనుంది.

బ్యాటరీ:

ఈ ఫోన్‌లో 2500mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. సూపర్ బ్యాటరీ మోడ్ సాయంతో గరిష్టంగా 55 రోజుల స్టాండ్‌బై టైమ్ అందుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఆధునిక వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు.

ధర:

ఐటెల్ పవర్ 451 ధర కేవలం రూ.1,699గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ ఇప్పటికే విక్రయాలకు అందుబాటులో ఉంది. ఇందులో తయారీ లోపాలు ఎదురైతే ఒక సంవత్సరం కౌంటర్ రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా కంపెనీ ప్రకటించింది.

Image (1)

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

MP Uday Srinivas: కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్...

Donald Trump: భారత్‌ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?

Donald Trump: భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాలు...

SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దృశ్య...