19
February, 2026

A News 365Times Venture

19
Thursday
February, 2026

A News 365Times Venture

144Hz AMOLED, 6150mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో Tecno Camon 50 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!

Date:

Tecno Camon 50 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) తన కామన్ సిరీస్‌లో భాగంగా సరికొత్త మోడళ్లను ప్రపంచ మార్కెట్‌ లో లాంచ్ చేసింది. టెక్నో కామన్ 50 (Tecno Camon 50), టెక్నో కామన్ 50 ప్రో (Tecno Camon 50 Pro) స్మార్ట్‌ఫోన్లు మంచి కెమెరా ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకొనేలా ఉంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2026కు ముందే ఈ ఫోన్ల వివరాలను కంపెనీ వెల్లడించింది. మరి ఈ మొబైల్స్ పూర్తి వివరాలు చూసేద్దామా..

డిస్‌ప్లే & డిజైన్:
టెక్నో కామన్ 50 ప్రో, కామన్ 50 రెండు ఫోన్లు 6.78 అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో వస్తాయి. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ప్రో మోడల్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లే హై-క్వాలిటీ విజువల్స్, స్మూత్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!

పెర్ఫార్మెన్స్:
ఈ స్మార్ట్‌ఫోన్లలో మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ (MediaTek Helio G200 Ultimate) చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ప్రో మోడల్‌లో 12GB వరకు ర్యామ్ (RAM), 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి.

Image (2)

కెమెరా ఫీచర్లు:
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం టెక్నో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కామన్ 50 ప్రో మొబైల్ లో వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP టెలిఫోటో లెన్స్ (3X జూమ్) మరియు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక కామన్ 50లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీ విషయంలో రెండు ఫోన్లలో కూడా ముందు భాగంలో 32MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Engineering Colleges Fees: ఇంజనీరింగ్ (B.E/B.Tech) కోర్సుల్లో ఫీజుల ఖరారు.. ఏ కాలేజీలో ఎంత ఫీజులు చెల్లించాలంటే!

బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ సిరీస్‌లో అతిపెద్ద ఆకర్షణ 6,150mAh భారీ బ్యాటరీ. ఇది సాధారణ వినియోగంలో ఎక్కువ కాలం పాటు పనిచేస్తుంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐదేళ్ల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ధరలు:
ప్రస్తుతానికి ఈ ఫోన్లు కెన్యా వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. టెక్నో కామన్ 50 ధర రూ. 24,000 కాగా.. టెక్నో కామన్ 50 ప్రో సుమారు రూ. 27,000 వరకు నిర్ణయించింది కంపెనీ. ఈ ఫోన్లు మూన్‌లైట్ బ్లాక్, మలాకైట్ గ్రీన్, లావెండర్ మిస్ట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 23 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారతదేశంలో వీటి విడుదల తేదీ, ధరపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Manik Gupta: మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగల దాడి.. అంపైర్ మృతి!

Cricket Umpire Manik Gupta Dies: ఉత్తరప్రదేశ్‌ లో ఓ విషాదకర...

Astrology: ఫిబ్రవరి 19, గురువారం దినఫలాలు..

NTV Daily Astrology as on 19th February 2026: ఈ...

Off The Record: అంచనాలను అందుకోని కమలం..! బీజేపీ ఎందుకు ప్రభావం చూపలేకపోయింది..?

Off The Record: తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ...