29
May, 2026

A News 365Times Venture

29
Friday
May, 2026

A News 365Times Venture

120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్‌ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..

Date:

Xiaomi 17T, Xiaomi 17T Pro Launched: షియోమీ (Xiaomi) నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ Xiaomi 17T, Xiaomi 17T Proలను లాంచ్ చేసింది. ఆస్ట్రియాలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్లను ప్రకటించిన కంపెనీ, ఈసారి T సిరీస్‌లో మొదటిసారిగా కాంపాక్ట్ & పెద్ద డిస్‌ప్లే ఆప్షన్ల రెండు వేర్వేరు సైజ్‌ లలో ఫోన్లను తీసుకువచ్చింది.

ఈ సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కెమెరా వ్యవస్థ. లైకా (Leica) భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో ఉంది. రెండు ఫోన్లలోనూ 50 MP మెయిన్ కెమెరాను అందించారు. అయితే Xiaomi 17T Proలో పెద్ద 1/1.31 అంగుళాల సెన్సార్ ఉండగా, స్టాండర్డ్ 17Tలో 1/1.55 అంగుళాల సెన్సార్ ఉంది. ఇవి Leica Summilux లెన్స్ డిజైన్‌తో పాటు అల్ట్రా పూర్ ఆప్టికల్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. అంతేకాకుండా రెండు ఫోన్లలో కూడా 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, OIS సపోర్ట్ అందించారు. ఇది 30 సెం.మీ మాక్రో ఫోటోగ్రఫీ నుంచి 120x AI Ultra Zoom వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే Xiaomi 17T Proలో 4K 60fps సినీమాటిక్ వీడియో రికార్డింగ్, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. లైకా లైవ్ మూమెంట్, స్టేజి మోడ్ వంటి కొత్త కెమెరా ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Xiaomi 17T సిరీస్‌లో కంపెనీ కొత్త విజన్ కేర్ (Vision Care) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇది కళ్లపై ఒత్తిడి తగ్గించే విధంగా ఆటోమేటిక్ బ్రైట్‌నెస్, బ్లూ లైట్ కంట్రోల్, ఫ్లికర్ తగ్గింపు వంటి ఫీచర్లతో పనిచేస్తుంది. ఇంకా ఇది 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉండగా, 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. మరోవైపు Xiaomi 17T Proలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. రెండు ఫోన్లలోనూ 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ లభిస్తుంది.

Image (1)

బ్యాటరీ విషయంలో కూడా Xiaomi భారీ అప్‌గ్రేడ్ ఇచ్చింది. Xiaomi 17Tలో 6500mAh బ్యాటరీ ఉండగా, 67W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మరోవైపు 17T Proలో ఏకంగా 7000mAh బ్యాటరీ అందించారు. ఇది 100W వైర్డ్ హైపర్ ఛార్జ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Xiaomi 17Tలో MediaTek Dimensity 8500-అల్ట్రా చిప్‌సెట్ ఉండగా, Xiaomi 17T Proలో ఫ్లాగ్‌షిప్ స్థాయి MediaTek Dimensity 9500 3nm ప్రాసెసర్ అందించారు. రెండు ఫోన్లలోనూ LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్, Xiaomi HyperOS 3 ఆధారిత ఆండ్రాయిడ్ 16 లభిస్తుంది.

ఈ ఫోన్లలో IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆటమ్స్ డ్యూయల్ స్పీకర్లు, Wi-Fi 7, బ్లూటూత్ 6.0 వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. Xiaomi 17T ప్రారంభ ధర EUR 749.99గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది రూ.83,500 వరకు ఉంటుంది. అలాగే Xiaomi 17T Pro ప్రారంభ ధర EUR 899.99గా ఉంది. ఇది భారత కరెన్సీలో రూ.1 లక్ష వరకు ఉంటుంది. యూరప్, యూకే మార్కెట్లలో ఈ ఫోన్ల విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారత్‌లో Xiaomi 17T సిరీస్‌ను జూన్ 4న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలిపింది.

Image

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్...

CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే

CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో...

Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆటో అవతారమెత్తారు....

Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న...