14
October, 2026

A News 365Times Venture

14
Wednesday
October, 2026

A News 365Times Venture

12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్‌ నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!

Date:

Honor Win 2 Series: హానర్‌ (Honor) నుండి కొత్త Win 2 సిరీస్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను చైనాలో అక్టోబర్‌ 21న అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Honor Win 2, Win RT 2, Win Turbo 2 వంటి మోడళ్లు ఉన్నాయి. లాంచ్‌కు ముందే ఈ మూడు ఫోన్లు హానర్‌ చైనా ఆన్‌లైన్‌ స్టోర్‌లో లిస్ట్‌ అయ్యాయి. దీంతో వాటి డిజైన్‌, కలర్‌ ఆప్షన్లు, కొన్ని కాన్ఫిగరేషన్లు వెల్లడయ్యాయి.

ఈ సిరీస్‌లో Honor Win RT 2 ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ టిప్‌స్టర్‌ డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ ప్రకారం.. ఈ ఫోన్‌లో 185Hz రిఫ్రెష్‌ రేట్‌తో 2K AMOLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది చాలా సన్నని బెజెల్స్‌తో స్క్రీన్‌ వస్తుందని సమాచారం. ఇందులో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌, వేడిని నియంత్రించేందుకు ఇన్‌బిల్ట్‌ కూలింగ్‌ ఫ్యాన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే డ్యూయల్‌ 1216 సిమెట్రికల్‌ స్పీకర్లు ఉండనున్నాయి.

అయితే ఈ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ఫీచర్‌ మాత్రం బ్యాటరీ. ఏకంగా 12,070mAh భారీ బ్యాటరీతో Win RT 2 రానుంది. 3C సర్టిఫికేషన్‌ ప్రకారం దీనికి 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ సామర్థ్యం మెయిన్‌స్ట్రీమ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలోనే అత్యంత పెద్దదిగా నిలిచే అవకాశం ఉంది. Honor Win RT 2ను 12GB+256GB, 16GB+256GB, 12GB+512GB, 16GB+512GB వేరియంట్లలో తీసుకురానున్నారు. ఇక Win Turbo 2 కూడా ఇవే కాన్ఫిగరేషన్లతో పాటు 8GB+256GB బేస్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. Win Turbo 2 స్పెసిఫికేషన్లపై ప్రస్తుతం పూర్తి సమాచారం లేదు.

ఈ సిరీస్‌లో ప్రీమియం మోడల్‌గా భావిస్తున్న Honor Win 2 కూడా 2K రిజల్యూషన్‌, 185Hz రిఫ్రెష్‌ రేట్‌ కలిగిన AMOLED డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. Win RT 2, Win 2 రెండింటిలోనూ దాదాపు 6.89 అంగుళాల స్క్రీన్‌ ఉండనున్నట్లు సమాచారం. ఇందులో Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ ఉండొచ్చని సమాచారం. అలాగే 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. RAM, స్టోరేజ్‌ పరంగా Win RT 2లోని వేరియంట్లతో పాటు అదనంగా 16GB+1TB వేరియంట్‌ కూడా అందుబాటులోకి రానుంది.

Win RT 2, Win Turbo 2 ఫోన్ల అధికారిక చిత్రాల్లో Red and Blue Buff, Quickly Star Black, Designated Win వంటి కలర్‌ ఆప్షన్లు కనిపించాయి. Win 2 కూడా Red and Blue Buff, Quick Black, Guaranteed Win వంటి రంగుల్లో రానున్నట్లు సమాచారం.
అక్టోబర్‌ 21న చైనాలో ఈ మూడు ఫోన్లను హానర్‌ అధికారికంగా విడుదల చేయనుంది. లాంచ్‌ సమయంలో ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు, కెమెరా వివరాలు వంటి మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ (వీబీ-జీరాంజీ) పథకంలో పనిచేస్తున్న దాదాపు 3,800...

Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?

Story Board: ఏపీలో స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. దీంతో...

AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల...