28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

Date:

2026 Royal Enfield Guerrilla 450 Apex: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన గెరిల్లా రోడ్‌ స్టర్ బైక్‌ కు 2026లో కొత్త అప్డేట్‌ ను తీసుక వచ్చేసింది. ఇందులో భాగంగా గెరిల్లా 450కు కొత్త టాప్ వేరియంట్‌గా “ఏపెక్స్” మోడల్‌ను పరిచయం చేసింది. మెరుగైన టైర్లు, మార్చిన రైడింగ్ పొజిషన్‌తో ఈ కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. 2026 గెరిల్లా 450 ఏపెక్స్, సాధారణ గెరిల్లా 450తో పాటు అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది. రెండు వేరియంట్లు మూడు ట్రిమ్‌ లలో లభ్యమవుతాయి.

పేరుకు తగ్గట్టుగానే “ఏపెక్స్” వేరియంట్ మరింత ఆగ్రెసివ్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450లో ముందు, వెనుక రెండింటిలోనూ 17 అంగుళాల చక్రాలు ఉంటాయి. ఏపెక్స్ వేరియంట్లో వీరెడెస్టీన్ సెంట్యూరో ఎస్టీ రోడ్ టైర్లు అమర్చారు. ఇవి సాధారణ మోడల్‌ లో ఉన్న సీయాట్ స్టీల్ రేడియల్ టైర్ల స్థానంలో వచ్చాయి. ఈ కొత్త టైర్లు రోడ్డుపై 8% మెరుగైన పట్టును, తడి రోడ్డుపై 17% ఎక్కువ పట్టును ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ వేరియంట్‌లో హ్యాండిల్‌బార్‌ను 56mm కిందకు, 57mm ముందుకు మార్చారు. దీంతో రైడింగ్ పొజిషన్ మరింత స్పోర్టీగా మారింది.

April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

ఏపెక్స్ వేరియంట్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బాడీ రంగుకు సరిపోయే వెనుక సీటు కవర్‌ తో ఇది మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ఇక వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌లైట్‌పై కలర్ హుడ్ అందించారు. అయితే సాధారణ మోడల్‌ లో ఉండే ఫ్రంట్ ఫోర్క్ కవర్లు ఇందులో లేవు. దీంతో ఇది మరింత సింపుల్ లుక్‌ ను అందిస్తుంది.

Image

సాధారణ గెరిల్లా 450లో కొత్త నీలం రంగు పెయింట్ స్కీమ్‌ ను జోడించారు. అంతే కాకూండా హెడ్‌ లైట్ గార్డులు, చేతి రక్షణ గార్డులు, ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్‌ను అందించారు. ఈ కొత్త 2026 గెరిల్లా 450లో ఇంజిన్, ఇతర సాంకేతిక భాగాలు యథాతథంగా ఉన్నాయి. 452 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 40 bhp, 40 nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు గేర్‌ల ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

Mohsin Naqvi: పరువంతా పోయిందిగా మోహ్‌సిన్ నఖ్వీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అంటూ గరం గరం..

ఇందులో ట్విన్ స్పార్ ఫ్రేమ్, షోవా సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు కూడా కొనసాగుతున్నాయి. స్ట్రీట్, స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. వృత్తాకార కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే కూడా కొనసాగించారు. ఇక నావిగేషన్, కనెక్టివిటీ వంటి ఫీచర్లను కాస్త మెరుగుపరిచారు. బైకు ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత మరింత తీవ్ర రూపం...

Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే...

Iran Strikes Kuwait: కువైట్ పోర్టుపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!

Iran Strikes Kuwait: ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఆపరేషన్ ట్రూ...

Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ Polo EV లీక్.. లాంచ్‌కు ముందే కార్ డిటైల్స్..

Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ పోలో, కార్ లవర్స్‌‌లో ఈ...